

- మురళీ కి అభినందనలు తెలిపిన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యనిర్వాహణ కార్యదర్శి పర్వత సురేష్..
శంఖవరం మన న్యూస్ (అపురూప్): పదవ తరగతి ఫలితాలలో మండలంలో ప్రధమ స్థానం కైవసం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాల (ఏపీ మోడల్ స్కూల్) విద్యార్థి ఎద్దు బాల మురళి (584/600) గౌరవ సన్మాన పురస్కారం లభించింది.కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గల వివేకానంద హాల్లో గురువారం ఏర్పాటు చేసిన అభినందన సభలో బాలమురలేని కలెక్టర్ సన్మోహన్ సాల్వ కప్పి సత్కరించి ఒక మంచి పుస్తకాన్ని 10 వేల రూపాయలు నగదు బహుమతిని అందించారు. పదవ తరగతి ఫలితాలలో ప్రతిభను కనబరిచిన బాల మురళి నీ మరొకసారి ఉన్నత అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమానికి డిఇఓ రమేష్, మోడల్ స్కూల్ ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ వై ఎస్వి కిరణ్, యుటిఎఫ్ నాయకులు తోట సీతారామయ్య, బాల మురళి తల్లి సుబ్బలక్ష్మి హాజరయ్యారు.అనంతరం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యనిర్వాహణ కార్యదర్శి పర్వత సురేష్, శంఖవరం మండలం ఎంఈఓ లు ఎస్వి రమణ, గోవిందు, ఉపాధ్యాయులు బాల మురళి ని అభినందించారు.