

పర్యాటకుల మృతికి ఘన నివాళి
మతోన్మాద పాక్ ముష్కరులు మూల్యం చెల్లించక తప్పదు
మనన్యూస్,తిరుపతి:కాశ్మీర్ లోని పహల్గాంలో మతోన్మాద పాక్ ఉగ్రవాదులు పర్యాటకులపై విచక్షణారహితంగా దాడి చేసి కాల్చి చంపిన పాక్ ముష్కరులు మూల్యం చెల్లించక తప్పదని తిరుపతి మానవత శాఖ తీవ్రంగా హెచ్చరించి, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం ఉదయం తిరుపతిలోని రుద్రరాజు సంపూర్ణమ్మ గార్డెన్స్ లో జరిగిన సమావేశంలో మానవతా సభ్యులు ముష్కరుల దాడిలో మృతి చెందిన హిందూ బంధువులకు మౌనం పాటించి, ఘన నివాళి అర్పించారు. కాశ్మీర్ ఘటనను మతోన్మాద దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. ఓంకారంతో పుష్పాంజలి ఘటించి భారత్ మాతాకీ జై, వందేమాతరం, జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. పాక్ ఉగ్రవాద ముష్కరులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హిందూ దేశంలో పాక ఉగ్రవాదులను ఏరి పారేయాలి అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భగవంతుని ప్రార్థించారు. అనంతరం మానవతా నెలవారి సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ పై సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో మానవతా సెంట్రల్ కమిటీ డైరెక్టర్ ఎన్వి కృష్ణారెడ్డి, చైర్మన్ భార్గవ, కో చైర్మన్ రాళ్లపల్లి మాధవ నాయుడు, అధ్యక్షులు ఎన్వి రమణ, కార్యదర్శి సుకుమార్ రాజు, కోశాధికారి భాస్కర్ రెడ్డి, కమిటీ సభ్యులు వేణుగోపాల్, పద్మనాభం, భాగ్యలక్ష్మి, చంద్రశేఖర్ రెడ్డి, సిరిగిరి శంకర్ రాజు, గురు ప్రసాద్, రిటైర్డ్ ఇన్స్పెక్టర్ కృష్ణయ్య, సాయి కృష్ణమరాజు, సుందర కుమార్ రాజు, కోనేటి రవి రాజు,బాలాజీ నాయుడు, మాధవ రాజు, నరసింహులు, మార్కండేయ రెడ్డి, రామస్వామి, సాయి రెడ్డి, నిరంజన్ నాయుడు, లోక్ సింగ్, షణ్ముగం, రమణయ్య, సుధాకర్ బాబు, నీరజ,భార్గవి, నవీన్, ప్రవీణ్, లోకేష్, సుధాకర్ అధిక సంఖ్యలో మానవతామూర్తులు పాల్గొన్నారు.