

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు దుర్గా శ్రీనివాస్: జమ్ము కాశ్మీర్లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చడాన్ని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్,జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి,సంయుక్త కార్యదర్శులు పెంటకోట మోహన్,దాసం శేషారావు తీవ్రంగా ఖండిస్తూ మృతులకు సంతాపం తెలియచేసి నియోజకవర్గ కేంద్రమైన ప్రత్తిపాడులో పంచాయితీ కార్యాలయం నుండి అల్లూరి సీతారామరాజు సెంటర్ వరకు నియోజకవర్గ జనసైనికులతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాదులు దాడిలో పర్యాటకుల మృతులకు సంతాపం తెలియచేస్తూ మూడు రోజులపాటు సంతాప కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు కొవ్వొత్తుల ర్యాలీ చేసి మరణించిన వారికి నివాళులు అర్పించామని తెలియజేశారు.కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉగ్రవాద దాడులపై చర్యలు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో గాబు సుభాష్, రామకుర్తి కామేష్,గంగిరెడ్ల మణికంఠ,తలపంటి బుజ్జి,విజయ్,శీరం శ్రీను,పోసిన శ్రీను,గుండం సత్యనారాయణ,అచ్చే వీరబాబు,నియోజకవర్గ నాలుగు మండలాల జనసేన నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు..