

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: బి.ఆర్.అంబేద్కర్ గురుకులం విద్యార్థులు ఈ రోజు విడుదలైన పదోతరగతి ఫలితాల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు.మొత్తం 77 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా,74 మంది ఉత్తీర్ణులయ్యారు. గురుకులం సాధించిన 96.5% పాస్ శాతం రాష్ట్ర స్థాయిలోనూ ప్రశంసనీయంగా నిలిచింది.ఈ ఫలితాల్లో టి. మాహి అత్యధికంగా 560 మార్కులు సాధించి మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు.ఎం.అమృత 533 మార్కులతో రెండవ స్థానం,బి.లలిత 523 మార్కులతో మూడవ స్థానం పొందారు.విజేతలను ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు తెలియజేశారు. విద్యార్థుల కృషికి తోడుగా,ఉపాధ్యాయుల మార్గదర్శకత, తల్లిదండ్రుల సహకారం తో ఈ విజయానికి ప్రధాన కారణమని తెలిపారు.బి.ఆర్. అంబేద్కర్ గురుకులం ఈ సఫలతతో తన ప్రతిష్టను మరింత పెంచుకుంది. విజేతలందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు, భవిష్యత్తు విద్యారంగంలో విజయాలు సాధించాలని కోరుకుంటూ—అభినందనలు!