

ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు..
శంఖవరం మన న్యూస్ (అపురూప్): మండల కేంద్రమైన శంఖవరం గ్రామంలో పత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుకుల సత్యప్రభ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పర్వత సురేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75 వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా టీడీపీ నాయకులు బుర్ర వాసు కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వీట్లు పంచారు. నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో కొనసాగుతూ చంద్రబాబు నాయుడు ఎన్నో విజయాలు సాధించారని, హైదరాబాదును ఐటి హబ్ గా మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారని, ఆయన పరిపాలన విధానాలు, సంస్కరణలు ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని ప్రజలు నాడిని పసిగట్టగల నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు.ఈ కార్యక్రమంలో శంఖవరం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.