

ఈస్టర్ వేడుకల్లో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి
మన న్యూస్,ఎస్ఆర్ పురం:- ఎస్ఆర్ పురం మండలం 49 కొత్తపల్లి మిట్ట సిఎస్ఐ చర్చిలో వైఎస్ఆర్సిపి యువ నాయకుడు శ్యామ్ ఆధ్వర్యంలో ఈస్టర్ డే పండుగ ఘనంగా నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రపంచ శాంతి కోసం దైవ దూతగా జన్మించి ప్రపంచంలో శాంతి నెలకొల్పిన మహనీయుడు, కరుణామయుడు ఏసుప్రభు అని అన్నారు. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని సూచించారు.ప్రతి కార్యకర్త ,నాయకుడికి నేను అండగా ఉంటా ఎవరు ఆధర్య పడకండి అని అన్నారు.ఇదే ఉత్సాహంతో రానున్న రోజుల్లో అధికార పార్టీ చేసే దౌర్జన్యం అరాచకం అన్యాయాన్ని ప్రశ్నించాలని కార్యకర్తలకు నాయకులకు సూచించారు.ఈ కార్యక్రమానికి మండల కన్వీనర్ మణి, ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు గురువారెడ్డి, ఎంపీపీ జనార్ధన్,చిత్తూరు జిల్లా క్రియాశీలక కార్యదర్శి విజయబాబు ,కుప్పయ్య, గంగాధర్ నెల్లూరు మండల కన్వీనర్ వెంకటరామిరెడ్డి, కో ఆప్షన్ నెంబర్ యేసయ్య, కోటిరెడ్డి బాబు, సుధా, స్కైలా,గంగాధర్ నెల్లూరు మాజీ సొసైటీ అధ్యక్షులు వేల్కూరు బాబు రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామయ్య, నల్ల వెంగనపల్లి సర్పంచ్ శివాజీ, నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.