

మన న్యూస్ సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లా మహిళల బీచ్ కబడ్డీ జట్టును పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంపిక చేసినట్లు ప్రధానోపాధ్యాయులు డివిఎస్ ప్రసాద్ తెలిపారు.ఈ జట్టు 12 వ ఆంధ్ర రాష్ట్ర అంతర్ జిల్లాల బీచ్ కబడ్డీ టోర్నమెంట్ లో పాల్గొనున్నట్లు ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు కుర్రా.భాస్కరరావు సెక్రెటరీ పూర్ణ చంద్రరావు తెలిపారు. ఈ సెలక్షన్స్ ప్రక్రియను ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు జి.శ్రీనివాసరావుగారు జాయింట్ సెక్రెటరీ పిల్లి హజరత్తయ్య గారు,యన్.శ్రీనివాస రావు గారు పర్యవేక్షించారు. వీరు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో 02/05/25 నుండి 04/05/25 వరకు జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనున్నారు
ఎంపికైన జట్టు వివరాలు:-
వి.అర్చన,కె.భూమిక,కె.సౌమ్య కె.త్రిగుణ,కె.సిపోరా( పాకల) వి.రోహిణి(టెంకాయ చెట్ల పాలెం)