మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హాజరయ్యారు.అనంతరం
బిచ్కుంద మండలంలోని ఆయా గ్రామాల నాయకులు,కార్యకర్తలు గ్రామ సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకోవచ్చారు. వీలైనంత త్వరగా వారి సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు.నియోజకవర్గంలో రోడ్లు, మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, వ్యవసాయం మెరుగుపరచడమే తన ప్రాథమిక లక్ష్యమని అన్నారు.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు నియోజకవర్గంలో మనం చేపట్టిన అభివృద్ధి పనుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యకర్తలకు సూచించారు. గ్రామాలలోని ఏ సమస్య ఉన్న నా దృష్టికి తీసుకు వస్తే ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *