
మన న్యూస్, నెల్లూరు రూరల్,ఏప్రిల్ 18 : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 17వ డివిజన్, డి.యస్.ఆర్ లేఔట్ పార్థసారథి నగర్ లో శుక్రవారం ఉదయం పర్యటించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలలకే రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు , ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ , యువనేత, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఇప్పటికే 191 కోట్ల రూపాయల వ్యయంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ధి పనులు సాగుతున్నాయి అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. శివారు ప్రాంతాల అభివృద్ధికై ఇప్పటికే నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.17వ డివిజన్ డి.యస్.ఆర్ లేఔట్,పార్థసారథి నగర్ నందు రోడ్లు, త్రాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.
