

మనన్యూస్,నర్వ:టీజీ గురుకుల సెట్ ఫలితాలలో నారాయణపేట జిల్లా నర్వ మండలంలో & సూర్య విద్యా మందిర్ పాఠశాల విద్యార్థులు మెరిశారు. పాఠశాల నుంచి దాదాపు 15 మంది విద్యార్థులు 5, 6, 7, 8వ తరగతికి ప్రవేశ పరీక్ష రాయగా అందులో నుండి మొన్న వెల్లడించిన ప్రవేశ ఫలితాలలో దాదాపు 10 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆయన అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.., పేద విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని గురుకుల సెట్ పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి, విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించి, ప్రాక్టీస్ టెస్ట్‌లను పెట్టి పరీక్షలకు సిద్ధం చేశామన్నారు. ఈ సందర్భంగా సహకరించిన ఉపాధ్యాయ బృందాన్ని మరియు తల్లిదండ్రుల్ని ఆయన అభినందించారు.
