

మన న్యూస్,నిజాంసాగర్, స్వచ్ఛంద సంస్థల ట్రస్టుల ద్వారా గ్రామాల అభివృద్ధి వైపు నడిపించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు. మొహమ్మద్ నగర్ మండలంలోని కాలిపూర్ గ్రామంలో జి.వి.ఆర్ ట్రస్టును ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు.. ట్రస్టు ద్వారా గ్రామాన్ని దత్తత తీసుకొని ఒక ఏడాదిలోనే అభివృద్ధి కనిపించేటట్లు చేయాలన్నారు. ట్రస్టు ద్వారా ఈ గాలిపూర్ గ్రామం అభివృద్ధి చెందుతే వేరే గ్రామాలను కూడా ఆదర్శంగా తీసుకునేటట్లు చేయాలన్నారు. గాలిపూర్ గ్రామంలో జివిఆర్ ట్రస్టు ప్రారంభించను ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు.ఈ కార్యక్రమంలో జివిఆర్ ట్రస్టు నిర్వాహకుడు శ్రీధర్ రెడ్డి, పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, మొహమ్మద్ నగర్ నిజాంసాగర్ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి,ఏలే మల్లికార్జున్,నాయకులు గంగి రమేష్,లోక్య నాయక్,సవాయి సింగ్,ఆకాష్,సంతోష్, హనుమాన్లు,సరస్వతి,తదితరులు ఉన్నారు.
