

మనన్యూస్,ఎల్బీనగర్:హైదరాబాద్ మహానగరంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కొత్తపేటలో నూనంగా ఏర్పాటు చేసిన విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ 2వ స్టోర్ ను టాలీవుడ్ నటి వైష్ణవి చైతన్య ఆదివారం ఘనంగా ప్రారంభించారు. నటిని చూసేందుకు వచ్చిన అభిమానులతో ప్రాంతమంతా కోలాహలంగా కనిపించింది. అభిమానులకు వైష్ణవి చేతన్య హాయ్ అంటూ ఆత్మీయంగా పలకరిస్తూ సందడి చేశారు. స్టోర్ లో ఆభరణాల కలెక్షన్స్ ను విశిష్ట జ్యువెలరీస్ డైమండ్ షోరూం యజమానులు పలబట్ల ఆనంద్ బాబు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్, పలబట్ల శ్రీదేవి, పలపట్ల సుమంత్, పలభట్ల వైష్ణవి, పలబట్ల సింధూరలతో కలసి తిలికిస్తూ ఆమె కలవడిగా తిరిగారు. ఈ సందర్భంగా నటి వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. విశిష్ట గోల్డ్ అండ్ డైమంజ్ జ్యూవెలరీ ఎంతో అద్భుతంగా డిజైన్ చేశారన్నారు. ఇక వెడ్డింగ్ కలెక్షన్ కు విశిష్ట కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుందన్నారు. తాను కూడా లైట్ వెయిట్ డైమండ్ జ్యూవెలరీ అంటే ఎంతో ఇష్టపడతానన్నారు. ఇక విశిష్టలో విభిన్నంగా, సంప్రదాయ శైలిని ఆధునికతతో సమ్మిళితంగా చేసిన డిజైన్లు తనను ఎంతో ఆకట్టుకున్నాయన్నారు. అనంతరం విశిష్ట సీఈఓ, డైరెక్టర్ సిందుజా, మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. ప్రతి ఆభరణాన్ని అత్యున్నత నైపుణ్యం కలిగిన కారిగులు శ్రద్ధతో డిజైన్ చేసినట్లు వివరించారు. ప్రతి డిజైన్ ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ బినగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా,ఎల్ వి కుమార్, టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, పురం వెంకటేష్ గుప్తా, మొగుళ్లపల్లి ఉపేందర్ గుప్తా, రిషి, కాంగ్రెస్ నేత చిలుక ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
