

మనన్యూస్,ఇబ్రహీంపట్నం:నియోజకవర్గం తుర్కయంజాల్ మున్సిపాలిటీ లోని సామ దివ్య,వరుణ్ రెడ్డి
సామ శ్వేత,అనీష్ రెడ్డి సంయుక్త నేతృత్వంలో కిడ్జి ప్రీ స్కూల్ ప్రారంభోత్సవం బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు యాజమాన్యాన్ని అభినందించారు. కిడ్జి ప్లే స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ,నర్సరీ,ఎల్కేజీ యూకేజీ క్లాసులు నిర్వహిస్తున్నామన్నారు. తమ స్కూల్లో పిల్లలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆటపాటలతో కూడిన విద్యను అభ్యసిస్తారన్నారు.స్థానిక ప్రజలందరూ తమ పిల్లలకు ఈ అవకాశాలు వినియోగించుకోవాలని అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయని అడ్మిషన్స్ కొరకు తమ ప్లే స్కూల్ ను సందర్శించాలన్నారు. ఈ కార్యక్రమంలో తుర్కయంజాల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. కొత్త కుర్మ మంగమ్మ శివ కుమార్. టి పి సి సి రాష్ట్ర నాయకులు కొత్త కుర్మ శివకుమార్ . అభిషేక్ రెడ్డి అన్న స్కూల్ యాజమాన్యం. సమా భీమ్ రెడ్డి .సామ మహిపాల్ రెడ్డి. సోమ వరుణ్ రెడ్డి. సామా ఆన్నుష్ రెడ్డి.కాంగ్రెస్ పార్టీ మజా తాజా కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు,బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
