• సుమారు 300 మందికి పైగా పరీక్షలు నిర్వహించిన వైద్య బృందాలు…

మన న్యూస్ శంఖవరం (అపురూప్) : కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం లో ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి ని పురస్కరించుకొని వారోత్సవాలలో భాగంగా శంఖవరం జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో శనివారం మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ మెగా వైద్య శిబిరంలో కాకినాడ మెడి కవర్ ఆస్పటల్ బృందం, కత్తిపూడి పద్మావతి ఐ కేర్ నేత్ర శిబిరం వారిచే సుమారు 250 మంది కీ ఉచిత వైద్య పరీక్షలు, 100 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది.అనంతరం లో వైద్య సేవలు అందించిన డా. వినోద్, డా.మహా లక్ష్మి, డా. కె రమేష్ , ఎస్. రాజు, జి. అశోక్ , వైద్యులను జై భీమ్ యూత్ సభ్యులు ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ యూత్ సభ్యులు గునపర్తి అపురూప్, ఎస్. నాగు, భరత్, బత్తిన తాతాజీ, పి. కిషోర్, జి. జాన్, పి. హర్ష వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *