

మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 11: బద్వేల్ పట్టణం నందు ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ చట్టం రద్దు చేయాలని నిరసన తెలపడం జరిగింది.ఈ సందర్భంగా ఆవాజ్ కమిటీ జిల్లా అధ్యక్షులు పి, చాంద్ బాషా,బద్వేల్ పట్టణ ఆవాజ్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఎస్,అబ్దుల్ సత్తార్ ,ఎస్,అన్వర్ భాష లు ,మాట్లాడుతూ కేంద్రంలో ని బి జె పి,ఎన్ డి ఏ ప్రభుత్వాలు ఏప్రిల్ 5 తేదీన అర్ధరాత్రి వక్ఫ్ సవరణ చట్టంకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు కొన్ని రాజకీయ పార్టీలు ముస్లిం పర్సనల్ లా బోర్డు మరియు ప్రజా సంఘాలు సుప్రీంకోర్టుకు ఆశ్రయించడం సుప్రీంకోర్టు ఈ కేసును విచారించుటకు అంగీకారం తెలిపింది , భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం అని ప్రపంచానికి చాటిన ప్రజల మధ్య మతోన్మాదానికి ప్రజల మధ్య అలాల్,పేరుతో హిజాబ్ పేరుతో ఆహారం పేరుతో త్రిబుల్ తలాక్ పేరుతో ముస్లిం మైనార్టీలపై భౌతిక దాడులు చేస్తుంటే వాటిని ఖండించకుండా ప్రేక్షక పాత్ర పోషించడం సరైంది కాదన్నారు నరేంద్ర మోడీ ముస్లింలకు న్యాయం చేస్తానని మాయ మాటలు చెబుతున్నారు ఈ చట్టం ముస్లింలకు నష్టమే తప్ప లాభం లేదు భారతదేశంలో అతిపెద్ద భూములున్న సంస్థలు మూడు ఉన్నవి ఒకటి మిలటరీ భూములు రెండవది రైల్వే రంగం మూడవది వక్ఫ్ బోర్డు ఆస్తులు,పై ఆస్తులు మోడీ గారు కార్పొరేట్ సంస్థకు ఆదానికి ఎప్పుడో కట్టబెట్టారు ఇప్పుడు ముస్లింల ఆస్తి పైన నరేంద్ర మోడీ కన్ను పడింది ఈ ఆస్తులను 52 కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేటకు నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధమైంది ముస్లింల పైన కపట ప్రేమ చూపిస్తున్నారు అని వారు అన్నారు కేంద్ర ప్రభుత్వం వ్యవహారం తలనొస్తుందని వైద్యం కోసం పోతే తల తీసేయండి అని అన్నాడంట అలా ఉంది అన్నారు. బిజెపి మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా భారత రాజ్యాంగాన్ని. భారతదేశాన్ని దేశ ప్రజాస్వామ్యాన్ని చిరచరాస్తులు ఐక్యతను లౌకిక విధానాలను ప్రేమించి గౌరవించే భరతమాత సేవ చేసే బిడ్డలందరును ఐక్యపరిచి నల్ల చట్టాలు వ్యతిరేకంగా పోరాటాలకై ప్రయత్నిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు కరిముల్లా,హసన్,ముస్తకిం,షరీఫ్,రసూల్,షంషేర్,ఇబ్రహీం,హబీబ్ ,మస్తాన్,మెహబూబ్ భాష, నాయూబ్ ,నాగూర్,ఖలీల్,మరియు పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొన్నారు.