

మన న్యూస్సిం, గరాయకొండ 09-04-2025: ఈరోజు కలికివాయి అంగనవాడి సెంటర్ నందు ఈనెల 8 నుండి 22వ తేదీ వరకు జరుగు పోషణ పక్వాడా కార్యక్రమమునకు మండల అభివృద్ధి అధికారి జయమణి అధ్యక్షతన మహిళా శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్ షేక్ రిజ్వానా షేక్ సైదాబీ ద్వారా నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమము నిర్దేశించి మండల అభివృద్ధి అధికారి జయమణి మాట్లాడుతూ ప్రభుత్వం బాలింతలలో గర్భవతులలో రక్తహీనత లేకుండా ఉండుటకు పోషకాహారం పంపిణీ చేయడం జరుగుతుందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరినారు అదేవిధంగా శ్యామ్ మ్యామ్ పిల్లలను గుర్తించి ఎన్ ఆర్ సి సెంటర్ కు రిఫర్ చేయాలని సూచించినారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పీరయ్య గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ సభ్యులు గ్రామ కార్యదర్శి అరుణ కుమారి సయ్యద్ మసూద్ అలీ అంగన్వాడీ సిబ్బంది వైద్య సిబ్బంది గర్భిణీలు బాలింతలు పాల్గొన్నారు.
