

మంగుంట గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎంపీ ,ఎమ్మెల్యే
మన న్యూస్, ఎస్ఆర్ పురం:- మేమిద్దరం అన్నదమ్ముల కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు , ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ అన్నారు. మంగళవారం ఎస్ఆర్ పురం మండలం మంగుంట గ్రామంలో 28 లక్షల ఎంపీ నిధులతో చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద్ రావు ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ ముఖ్య అతిధులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రజల సంక్షేమానికి కూటమీ ప్రభుత్వం వెనుకడదని ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. ఎంపీ నేను ఇద్దరు అన్నదమ్ముళ్లమే మా ఇద్దరి మధ్య ఏదో మనస్పర్ధలు ఉన్నాయని చెప్పడం హాస్యపదం గా ఉందని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు ,జిల్లా సీనియర్ నాయకుడు గంధమనేని రాజశేఖర్ నాయుడు, మండల ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి ,జనసేన మండల ఉపాధ్యక్షుడు చందు,నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కుమార్ ,మండల యువత అధ్యక్షుడు చంద్రబాబు రెడ్డి, జీవన్ రెడ్డి ,ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెంకటాచలం, పంచాయతీరాజ్ డి ఈ ఆనంద్ రెడ్డి,ఎంపీడీవో మోహన్ మురళి ,పంచాయతీరాజ్ ఏఈ సునీల్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ కుమార్, ఏపీఓ లలిత, ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ గుణశేఖర్ ఆచారి, పైనేని మురళి ,పైనేని ధనంజయ నాయుడు, మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు నాగరాజు ,జీవన్ , మధు ,రమేష్, కార్యకర్తల ,తదితరులు పాల్గొన్నారు.
