

మనన్యూస్,నెల్లూరు:నగరం లో విచ్చలవిడిగా సంచరిస్తున్న వీధి కుక్కల కట్టడి చేయాలి.
*వీధి కుక్కలకు ప్రతిరోజు ఇంట్లో వండుకొని వీధి లో వడ్డించే తల్లులకు విన్నపం..వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ టీకాలు వేసే భాద్యత తీసుకోండి.
రేబిస్ ప్రాణాంతకమైన వ్యాధి దీనికి మందు లేదు.
నెల్లూరు నగర పరిధిలో వీర విహారం చేస్తున్న పిచ్చికుక్కల కట్టడి చేయండి అంటూ జాయింట్ డైరెక్టర్ వెటర్నరీ డిపార్ట్మెంట్ కి ఫిర్యాదు చేసిన జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మరియు సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్.జంతువుల విషయమై ఉన్నతాధికారులతో కమిటీ వేసి ఉన్నారని త్వరలో చేస్తామని తెలిపారు.ఈ విషయాన్ని కమిషనర్ కి దృష్టికి మున్సిపల్ శాఖ మాత్యులు నారాయణ దృష్టికి కూడా తీసుకువచ్చి పిచ్చి కుక్కలను కట్టడం చేయాల్సిన అవసరం తెలియజేస్తామని తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
నివాస ప్రాంతాలలో ప్రజల భద్రతను కాపాడటానికి, నగర పరిమితి వెలుపల ఉన్న అన్ని వీధి కుక్కలను వెంటనే పట్టుకొని ఇతర ప్రాంతాలకు తరలించాలి.ప్రభుత్వం సూచించిన విధంగా వీధి కుక్కల స్టెరిలైజేషన్ మరియు టీకాలు వేయించే కార్యక్రమాన్ని అమలు చేసి వేగవంతం చేయాలి అని అన్నారు.అన్ని పెంపుడు కుక్కలు మున్సిపాలిటీలో నమోదు అయ్యాయని నిర్ధారించేందుకు, ఇంటింటికి తనిఖీలు నిర్వహించాలి మరియు అవసరమైన జనజాగరణ కార్యక్రమాలు చేపట్టాలి అని అన్నారు.తమ కుక్కలను పర్యవేక్షణ లేకుండా వీధిలో తిరగనివ్వడం లేదా కుక్కలకు గుర్తింపు లేని యజమానులకు కఠినమైన హెచ్చరికలు జారీ చేయాలి అని తెలిపారు.పెంపుడు కుక్కల యజమానులు తమ కుక్కలకు గుర్తింపు ట్యాగ్‌లు తప్పనిసరిగా జత చేయాలి, అందులో పెంపుడు జంతువు పేరు, యజమాని పేరు మరియు సంప్రదింపు నంబర్ ఉండేలా చూడాలి అన్నారు.వీధిలో దూకుడుగా తిరిగే లేదా ప్రజలకు హానికరంగా ఉన్న కుక్కల సమాచారాన్ని నివాసితులు తక్షణమే ఫిర్యాదు చేయడానికి, ప్రత్యేక హెల్ప్‌లైన్ లేదా ఫిర్యాదు వ్యవస్థను ఏర్పాటు చేయాలి
అని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్,జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్,సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, రిషికేష్ యాదవ్,42 డివిజన్ నాయకుడు షేక్ యాసిన్,డివిజన్ నాయకుడు పవన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
