ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ఆదేశాలతో..వింజమూరు మండలం లో టిడిపి సభ్యత్వం కార్డులు పంపిణీ..!

44 బూతులకు సంబంధించి తొమ్మిది వేల 30 సభ్యత్వం కార్డులను పంపిణీ చేసిన మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి..!

మనన్యూస్,వింజమూరు:తెలుగుదేశం పార్టీ ప్రతిష్మాత్మకంగా చేపట్టిన టిడిపి సభ్యత్వం ఉదయగిరి నియోజకవర్గంలో సుమారు లక్ష కు చేరుకుంది. ఆన్లైన్ ద్వారా సభ్యత్వం చేసుకున్న వారికి టిడిపి జాతీయ పార్టీ కార్యాలయం నుండి, నియోజకవర్గ ప్రధాన పార్టీ కార్యాలయానికి చేరుకున్న సభ్యత్వం కార్డులను మండలాల వారిగా పంపిణీ చేయాలని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆదేశాలు ఇచ్చారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయం సిబ్బంది, అంకబాబు మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు యాదవ్ ల ఆధ్వర్యంలో వింజమూరు లోని తెలుగుదేశం మండల పార్టీ కార్యాలయం నందు ఆదివారం క్లస్టర్ ఇంచార్జ్ యూనిట్ బూత్ ఇంచార్జ్ లకు బూతుల వారీగా పంపిణీ చేశారు. మండలానికి సంబంధించి సుమారు 9 వేల 30 కార్డులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి మాట్లాడుతూ బూత్ ఇంచార్జ్ లు సభ్యత్వం నమోదు చేసుకున్న వారికి కార్డులను అందజేయాలని తెలిపారు. ఈ కార్డులను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి అన్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చే సమయంలో వీటిని ధరించి రావాలన్నారు. సభ్యత్వం కార్డుల ద్వారా పార్టీ ప్రతి కార్యకర్తకు లబ్ధి చేకూరే విధంగా ఇన్సూరెన్స్ చేయడం జరిగిందని ఇది వారి కుటుంబానికి ఎంతో భరోసాగా ఉంటుందని తెలిపారు. నిర్లక్ష్యం వహించకుండా కార్డులను పంపిణీ చేయాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి పట్టణ అధ్యక్షులు కోడూరు నాగిరెడ్డి సీనియర్ నాయకులు గువ్వల కృష్ణారెడ్డి మంచాల శ్రీనివాసులు నాయుడు పాములపాటి మాల్యాద్రి దాట్ల కృష్ణారెడ్డి వనిపెంట సుబ్బారెడ్డి నీలం పెరుమాళ్ళ ఏగినేని శ్రీనివాసులు నాయుడు గురజాల వాసు నాయుడు కొండపల్లి వెంకటేశ్వర్లు నాయుడు అనుచూరీ శ్రీనివాసులు దంతులూరి కృష్ణయ్య నాయుడు నూతలపాటి జయలక్ష్మి ఓంకారం వేణుగోపాల్ పల్లా మధు నరేంద్ర దుద్దుగుంట శ్రీనివాసులు మల్లికార్జున పల్లాపు అంకయ్య పెద్దబ్బయ్య రవి జయన్న గంగపట్ల హజరత్ భూదాల ప్రేమ దాస్ మాధవ రఘు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!