

మనన్యూస్,నెల్లూరు:నెల్లూరు 47 డివిజన్ లోని కోదండ రామస్వామి ఆలయంలో శ్రీరామనవమి పండుగ వేడుకలకు వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరై ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని ప్రార్థించారు. అనంతరం ఆలయ పండితులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కి స్వామివారి ఆశీస్సులు తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు మజ్జిగ జయ కృష్ణారెడ్డి, వై సి పి నాయకులు ఖజానా వెంకటశేషయ్య ఆచారి, శివకామి, గోపి, లక్ష్మి, ఇందిరా.. అశోక్, మీరా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
