* ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ ఈగల విజయదుర్గ..
* విగ్రహం నీడ నిమిత్తం రూ. 12500 గ్రామ సర్పంచ్ విరాళం..
మన న్యూస్ శంఖవరం (అపురూప్) : భారత మాజీ ఉప రాష్ట్రపతి డా. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం జి. కొత్తపల్లి గ్రామ సర్పంచ్ ఈగల విజయదుర్గ ఘన నివాళి అర్పించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను, అణగారిన వర్గాల కోసం బాబూ జగ్జీవన్ రామ్ పోరాటం చేశారని ఆమె కొనియాడారు.
మండలంలోని జి కొత్తపల్లి గ్రామ తొలి ప్రవేశంలో గల బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఆయన 11వ జయంతి వేడుకలను స్థానిక దండోరా నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గ్రామ సర్పంచ్ ఈగల విజయదుర్గ విగ్రహానికి నీడ వేసే నిమిత్తం రూ.12500 రూపాయలు విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ ఈగల దేవుళ్ళు మాట్లాడుతూ, దేశానికి పలు సేవలు అందించిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. అనంతరం దండోరా కమిటీ సభ్యులు కేకులు కట్ చేసి అందరికీ పంచారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి ఈగల అప్పారావు వైస్ ఎంపీపీ ఈగల చిన్నమ్మలు టిడిపి నేతలు ఈగల త్రిమూర్తులు రాజబాబు మఠం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.









