మన న్యూస్,ఎస్ఆర్ పురం :-జీడి నెల్లూరు నియోజకవర్గ ఏపీయూడబ్ల్యూజే యూనియన్ అధ్యక్షులు ఎన్టీవీ రిపోర్టర్ తిరుమల ను శనివారం ఎస్ఆర్ పురం నియోజకవర్గ ప్రెస్ క్లబ్లో విశ్వకర్మ యువజన సేవా సమితి సంఘం నాయకులు సన్మానించారు. ఈ విశ్వకర్మ యువజన సేవా సమితి అధ్యక్షులు సుధాకర్ ఆచారి సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ ఎప్పటికప్పుడు నిజాన్ని నిర్భయంగా రాస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నది మీడియా అని అన్నారు. నియోజకవర్గ నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా అయినా మాంగాటీ తిరుమల ను ఈ సందర్భంగా సన్మానించి అభినందనలు తెలపడం జరిగిందన్నారు. కార్యక్రమంలో విశ్వకర్మ యువజన సేవా సమితి సభ్యులు జనార్ధన ఆచారి, వినాయక ఆచారి ,నరేష్ ఆచారి ,రామ్మూర్తి ఆచారి , నరసింహులు, పాల్గొన్నారు.







