క్రీడాకారుల నిధులు రోజా రూ. 119 కోట్లు దోచేశారు..

మనన్యూస్,తిరుపతి:వైసీపీ ప్రభుత్వంలో క్రీడల శాఖ మంత్రిగా ఉన్న ఆర్కే రోజా పేద క్రీడాకారులకు రూ. 119 కోట్లను దోచేశారని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవి నాయుడు ఆరోపించారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రవి నాయుడు మాట్లాడారు.మాజీ మంత్రి రోజాను అరెస్టు చేయటానికి దమ్ము అవసరం లేదని, పోలీస్ వారెంట్ ఉంటే చాలు అని గుర్తు చేశారు. వైసిపి ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న రోజా క్రీడాకారులకు చెందిన వందలాది కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడిందని దానిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించిందన్నారు. త్వరలో రోజా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లడం ఖాయమని జోష్యం చెప్పారు. రోజా క్రీడాకారుల డబ్బులతోనే బంగారు నగలు, నక్లెసులు, కార్లు, భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. రోజా నోటితో వల్లే 2024 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వైసిపి కేవలం 11 సీట్లకే పరిమితమైందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను ఏక వచనంతో మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. మాజీ మంత్రి రోజా చెన్నైలో మకాం వేసిందని, ఆమెకు చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో జరిగే అభివృద్ధి సంక్షేమం గురించి ఏమి తెలుసునని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వీకెండ్ పొలిటిషన్ గా మారిపోయారని, కర్ణాటకలో బిజినెస్ లు చూసుకుంటున్న జగన్ అక్కడే ఉండిపోవాలని సూచించారు. తిరుపతిలో ఉన్న వైసీపీ నాయకులు పగటివేషగాళ్లు లాగా తయారయ్యారని, భూమన కుటుంబాన్ని ప్రజలు చీదరించుకున్న ఇంకా ప్రజలను మభ్య పెట్టాలనుకోవడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను పెంచలేదన్న విషయం భూమన అభినయ రెడ్డికి తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. విద్యుత్ భూమన అభినయ రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. భూమన అభినయ రెడ్డి రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తిరుపతి నియోజకవర్గంలో భూమన భూభాగోతం అందరికీ తెలిసిందేనన్నారు. టిడిఆర్ బండ్ల కుంభకోణంలో అసలు పాత్రధారి భూమన అధినాయక్ రెడ్డి అని, త్వరలో ఆ కుటుంబం జైలుకు పోవడం ఖాయమన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను అభివృద్ధి చేస్తే తప్పేంటి అని వైసీపీ నేతలను ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వైసీపీ నేతలకు రవి నాయుడు తీవ్రంగా హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో టిడిపి తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి నైనార్ మహేష్ యాదవ్, తెలుగు యువత తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు కృష్ణా యాదవ్, యువత నాయకులు హేమంత్ రాయల్, సందీప్ పాల్గొన్నారు.

  • Related Posts

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా