

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్) స్వతంత్ర ఉద్యమకారుడు బడుగు బలహీన వర్గాల ఆశా కిరణం మాజీ భారతదేశ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ 117 వ జయంతి నగర పంచాయతీ ఏలేశ్వరం 11వ వార్డులో దళిత యువకులు ఘనంగా నిర్వహించారు,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి నాయకుడు పైల బోస్,అధికార్ న్యూస్ ఏపీ ఎండి అధికార్ విచ్చేశారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 5న బాబు జగజీవన్ రామ్ జన్మించి భారత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని భారత రాష్ట్ర ఉప ప్రధానిగా అన్ని వర్గాల ప్రజలకు విశేష సేవలు అందించి అశేష జనాదరణ పొందిన నాయకుడిగా పేరుగాంచారంటే అది కేవలం చదువు వల్లే సాధ్యమని వారన్నారు, ఈనాటి యువతరం ఆయన చరిత్రను అవపాసన పట్టి తరతరాలు చదువు పట్ల శ్రద్ధ వహించి తాము రాణించే రంగాలలో ముందుకెళ్లాలని భావితరాలకు బాటలుగా మారాలని అన్నారు,అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి,సీట్లు పంచిపెట్టి బాబు జగజ్జీవన్ రామ్ సేవలను కొనియాడారు, ఈ కార్యక్రమంలో 11వ వార్డుకు సంబంధించిన దళిత యువకులు,మహిళలు భారీ ఎత్తున పాల్గొని నినాదాలు ఇచ్చారు.