

మనన్యూస్,నారాయణ పేట:దళితుల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్ అని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ సిపిఐ జిల్లా కార్యదర్శి కే విజయ రాములు అన్నారు. మక్తల్ నియోజక వర్గంలోని అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న బాబు జగ్జీవన్ రావు విగ్రహం వద్ద దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్ విజయరాములు బాబు జగ్జీవన్ రావ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,బాబు జగ్జీవన్ 1905 ఏప్రిల్ 5 న బీహార్ లోన జన్మించారని అన్నారు. జగ్జీవన్ చిన్నతనంలో అంటరానితనాన్ని అలాగే అవమానాలను ఎదుర్కొన్నారని అన్నారు. సమాజంలో అస్పృశ్యతను నివారించేందుకు ఆయన ఎన్నో ఉద్యమాలను నిర్వహించాలని అన్నారు. 1974లో ఈ దేశంలో అతిపెద్ద కరువు వచ్చినప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారని కరువు నివారణ కొరకు కేంద్రం కమిటీ వేసి ఆయన బాధ్యత నిర్వర్తించి కరువు నివారణ చర్యకు మంత్రిగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని. ఈ దేశంలో ఎంతోమంది దళిత మహానుభావుల్లో బాబు జగ్జీవన్ రావ్ అని కొనియాడారు.ఆయన ఆశయాలను కొనసాగిస్తామని సందర్భంగా వారు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలోసిపిఐ మండల కార్యదర్శి ఏ అబ్రహం పట్టణ కార్యదర్శిఏ భాస్కర్ ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్,శ్యాంసుందర్, సౌలు, వినోద్, కేసులు కారడి లక్ష్మీనారాయణ, లచ్చన్న తదితరులు పాల్గొన్నారు.
