

మనన్యూస్,నెల్లూరు జిల్లా:ఉదయగిరిలోని నాగులబావిరికి చెందిన ఎస్.కె సమన్ అనే బాలిక తల్లిదండ్రులను కోల్పోయి అనాధ స్థితిలో ఉన్నప్పుడు షకీరా అనే మహిళ ఆ బాలికను చేరదీసి అన్ని తానై కన్న బిడ్డల సంరక్షిస్తూ చూసుకుంటున్న నేపథ్యంలో ఆ బాలికకు చదువుకు ఆటంకం ఏర్పడడంతో తను చదువుకు సాయం అందించాల్సిందిగా మన్నేటి వెంకటరెడ్డిని కోరింది వెంటనే స్పందించిన మన ఫౌండేషన్ వ్యవస్థాపకులు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి విద్యార్థి ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుకునేందుకు ప్రస్తుతానికి తక్షణ సాయం కింద పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు అంతేకాకుండా సదరు విద్యార్థికి షుగర్ కిడ్నీ వ్యాధి ఉందన్న విషయం తెలుసుకొని ఆమెకు ప్రభుత్వ పరమైన సాయం అందించేందుకు శాసనసభ్యుల సహకారం అవసరమని తెలిపారు శాసనసభ్యులు కాకర్ల సురేష్ ని కలిసి విద్యార్థి విషయం తెలియజేయాలని సూచించారు భవిష్యత్తులో మరి ఏదైనా అవసరం అయితే సాయం అందించేందుకు ముందు ఉంటానని హామీ ఇచ్చారు బాగా చదువుకోవాలని కోరారు బాలిక సంరక్షకురాలు షకీరా బాలిక సమన్ మన్నేటి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు దీంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తపరిచారు
