రాష్ట్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన డైరెక్టర్ కొండ్రు మరిడయ్య..

  • ఎస్సీ కార్పొరేషన్ రాయితీ రుణాలను వినియోగించుకోండి..

మనన్యూస్ తాడేపల్లి/ అమరావతి (గునపర్తి అపురూప్)

ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో డైరెక్టర్లు ప్రమాణ స్వీకార జరిగిన అనంతరం డైరెక్టర్ సబ్బవరపు గణేష్ చైర్మన్ మరియు రాష్ట్ర డైరెక్టర్లు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాలమ్మ వారి ప్రసాదం,మరియు కండువాలు అందజేశారు. అనంతరం రాష్ట్ర నీటిపారుదల శాఖ మాత్యులు శ్రీ నిమ్మల రామా నాయుడు,సాంఘిక శాఖా మాట్యులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి,కార్మిక శాఖా మాట్టులు శ్రీ వాసం శెట్టి సుభాష్,సాంఘిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ ఎమ్.మల్లిఖార్జున నాయక్ ని చైర్మన్ మరియు డైరెక్టర్లు సచివాలయానికి వెళ్ళి మర్యాద పూర్వకంగా కలిశారు. ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్లు నవంబర్ నియమితులైనప్పటికీ సాంకేతిక కారణాలవల్ల ఉత్తర్వులు ఆలస్యంగా వెళ్లడయ్యాయి. ఈ సందర్భంగా ఉత్తర్వులు ఇచ్చిందుకు గాను సంబధిత శాఖ అధికారులకు,మంత్రులకు కృతజ్ఞత లు తెలియజేయడమైనది.
ఎస్సీ కార్పొరేషన్ రాయితీ రుణాలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎస్సీ నిరుద్యోగులు మరియు ఇతర అర్హత కలిగిన యువత మరియు ఎస్సీ రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడయ్య అన్నారు. రాష్ట్ర నలు మూలాల్లో ప్రాంతాల వారీగా అనుకూలమైన యూనిట్లు నిర్వహించుకోవాలని ఇంకా కావల్సిన యూనిట్లు కొరకు ప్రాంతాల వారీగా ఎస్సీ లబ్ధి దారులు ,ఎస్సీ నాయకులు దళాలు సూచనలు ఇవ్వాలని డైరెక్టర్
మరిడయ్య కోరారు. కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మాల కార్పొరేషన్ చైర్మన్ పి. విజయ్ కుమార్ డైరెక్టర్లు 15 మంది, ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!