

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్):గర్భిణులు ఆరోగ్యకరమైన పౌష్టి కాహారంతో పాటు ఎప్పటికపుడు ఆరోగ్య నియమాలు పాటించడం ద్వారా సహజ ప్రసవం జరుగుతుందని సీహెచ్సీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ శైలజ అన్నారు.స్థానిక సీహెచ్సీలో గురువారం గర్భిణులు ఆరోగ్యపరంగా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు నిర్వహించారు.గర్భం దాల్చిన మహిళలు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోవటమే కాకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించు కోవాలన్నారు.వైద్యులు సూచనల మేరకు మంచి పోషక విలువులు కలగిన ఆహారాన్ని తీసుకోవాలన్నారు. సాధ్యమైనంత వరకూ సీజేరియన్ లేకుండా సహజ ప్రసవం జరిగేలా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో డా. హారిక, హెడ్ సిస్టర్ పరిమళ,మరియు సిబ్బంది పాల్గొన్నారు