

బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్*
మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు (దుర్గా శ్రీనివాస్):ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామంలో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా ఇండ్లు దగ్ధమైన రెండు కుటుంబాలను ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి నేత,ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీకృష్ణంరాజు పరామర్శించారు.గ్రామానికి చెందిన మొగిలి కృష్ణ,మొగిలి పెద్ద సత్తిబాబులకు చెందిన రెండు తాటాకిల్లులు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా దగ్ధమయ్యాయి.ఈ రెండు కుటుంబాలు ఇంట్లో లేని సమయంలో సంఘటన జరగటంతో బాధితులకు నిలువ నీడతో పాటు కట్టుబట్టలుకు కరువయ్యారు.ఈ నేపథ్యంలో ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి నేత ముదునూరి మురళీ కృష్ణంరాజు ఆ రెండు కుటుంబాలకు 50 కేజల బియ్యంతో పాటు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 20 వేల రూపాయల చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సంఘటన జరిగి వారం రోజులు గడుస్తున్న బాధిత కుటుంబాలను ఏ ప్రభుత్వ అధికారి పట్టించుకున్న దాఖలాలు లేవని ఆరోపించారు. బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.బాధితులకు ప్రభుత్వం పక్కా గృహాలు నిర్మించి వారిని అన్ని విధాలగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు రామిశెట్టి దొరబాబు,గంటా గంగబాబు,కోలా తాతబాబు, యాళ్ల ఏసుబాబు, ముదునూరి సీతారామరాజు, జువ్వల దొరబాబు తదితరులు పాల్గొన్నారు.