మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్ ):
పవిత్ర రంజాన్ పర్వదిన వేడుకలు
సోమవారం ఘనంగా నిర్వహించారు.
ఏలేశ్వరం లోని అడ్డతీగల రోడ్డు ఈద్గా స్థలంలో భక్తి శ్రద్ధలతో రంజాన్ ప్రత్యేక నమాజ్ తో ముస్లిం సోదరులు
జరుపుకున్నారు.మత పెద్ద జామీ మజీద్ ఇమామ్ మహబూబ్ నమాజ్ ను చదివారు. అనంతరం రంజాన్ పండుగ ప్రాముఖ్యతను తెలియజేశారు.ఈ సందర్భంగా జామియా అంజుమన్ కమిటీ పెద్దలు.మాటాడుతూ భారత దేశ ముస్లింలు రంజాన్ మాసంలో లోనే పవిత్ర గ్రంథం ఖురాన్ ఆర్షించడం జరిగిందన్నారు.30 రోజులు కఠోర ఉపవాస దీక్షలు పాటించి ప్రతిరోజు ప్రత్యేక తరాబి నమాజు పటించి అనంతరం జకాత్ ఫిత్రాలు మరియు హదీయాలు డబ్బు రూపాన పేదలకు అనాధలకు వితంతువులకు దానం చేస్తారన్నారు.ఈద్-ఉల్-ఫితర్ రంజాన్ పండుగ ప్రత్యేక నమాజు ముస్లిం చదువుతారని పేర్కొన్నారు. అనంతరం ఒకరికి ఒకరు అలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం ముస్లిం సోదరులు చనిపోయిన బంధువుల సమాధులపై పూలతో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు .ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ సభ్యులు దిల్బర్ హుస్సేన్,అమీర్,మహమ్మద్,వైస్ ప్రెసిడెంట్ షేక్ దాదాసాహెబ్, గౌరవ అధ్యక్షులు ఎస్కే సర్దార్, సెక్రటరీ అమీర్ ఎస్కే నూరిన్, షకీల్ రబ్బాని,మసీదు కమిటీ సభ్యులు ఏలేశ్వరం పట్టణ ఏలేశ్వరం మండల ముస్లింలందరూ పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *