మన న్యూస్ రౌతులపూడి (అపురూప్)

పవిత్ర మాసమైన రంజాన్ మాసంలో భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేస్తే పుణ్య ప్రాప్తి కలుగుతుందని ప్రత్తిపాడు బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు గునపర్తి అపురూప్ అన్నారు.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం లోని స్థానిక మదీనా మసీదులో ప్రత్తిపాడు నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. అనంతరం ముస్లిం సోదరులతో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు బీఎస్పీ అధ్యక్షులు గునపర్తి అపురూప్ మాట్లాడుతూ, ఈ పవిత్ర మాసంలో ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందదాయకం గా ఉందని అన్నారు. రంజాన్ మాసం ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైనదని రంజాన్ మాసం అంతా ఉపవాసాలతో నిత్యం ప్రార్ధనలలో గడుపుతారని అన్నారు.
ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఉపాధ్యక్షులు కొంగు రమేష్, ప్రధాన కార్యదర్శి బత్తిన తాతాజీ, శంఖవరం మండల అధ్యక్షుడు గునపర్తి రాఘవ, ముస్లిం సోదరులు షేక్ సర్దార్, షేక్ తనూషావల్లి, షేక్ హుస్సేన్, షేక్ సలీం, హఫీజ్ నాసిర్, షేక్ హూజైఫా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *