ఆంధ్రా-ఒడిస్సా సరిహద్దు చెక్పోస్టులు పరిశీలన – పోలీస్ స్టేషన్ లో రికార్డ్లు తనిఖీ

విలేకర్లుతో జిల్లా ఎస్పీ మాధవరెడ్డి

Mana News :- పాచిపెంట,నవంబర్13( మన న్యూస్ ):-గంజాయి నియంత్రణకు ప్రతిష్ట చర్యలు తీసుకోవడం జరిగిందని,గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్టు వేసేందుకు అక్రమార్కులపై ఉక్కు పాదం మోపుతామని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. ఆయన బుధవారం నాడు పాచిపెంట పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆయన ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఒరిస్సా రాష్ట్రం కోరాపుట్,రాయగడ జిల్లాల ఎస్పీలు తో సమావేశం ఏర్పాటు చేసి చర్చించడం జరిగిందని తెలిపారు.గంజాయి అక్రమ రవాణా ఒరిస్సా రాష్ట్రానికి చెందిన కోరాపుట్,సెమిలిగూడ,రాయగడ జిల్లాల నుండి ఎక్కువగా అక్రమ రవాణా జరుగుతుందని,గంజాయి అక్రమ రవాణా నియంత్రించేందుకు జిల్లాలో నాలుగు చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సిబ్బంది నియమించడం జరిగిందని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.మన పార్వతిపురం మన్యం జిల్లాలో గంజాయి కల్టివేషన్ జరుగుతుందని సమాచారంతో డ్రోన్ల సర్వే తో గుర్తించడం జరుగుతుందని తెలిపారు.గంజాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కొరకు విశాఖపట్నం రేంజ్ పరిధిలో ఒక డిఐజి,ఐజి నార్కో ట్రాన్స్పోర్ట్ అండ్ ఆర్కె రవి కృష్ణ మరియు ఎస్పీలు కలిసి ఒరిస్సా రాష్ట్రం చెందిన కొల్లాపూర్ రాయగడ డి ఐ జి మరియు ఐజీలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.వారితో చర్చలు నిర్వహించినట్లు తెలిపారు.అయినప్పటికీ గుర్తించి మాకు సహకరించాలని చెప్పడంతో వారు సహకరిస్తామని తెలిపినట్లు తెలిపారు. అదే విధంగా రాయగడ కొరాపుట్ ఎస్పీలతో కూడా మాట్లాడడం జరిగిందని అన్నారు. అలాగే ఇంటర్సిటీ బస్సులలో నిఘా పటిష్టం చేయడం జరిగిందని తెలిపారు.బస్సులలో వ్యాన్లు లో అక్రమ రవాణా చేస్తున్నప్పటికీ గంజాయి వాసన పసిగట్టే శిక్షణ ఇచ్చిన మ్యాక్స్ పోలీస్ కుక్కలను ప్రతి చెక్ పోస్ట్లు వద్ద పెట్టడం జరిగిందని, జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణ కొరకు యాంటీ మార్క్ టాస్క్ పోర్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు.అలాగే మత్తు పదార్థాలు బారిన పడకుండా కాలేజీ స్కూల్ పిల్లలు కాపాడుకోవడం కోసం ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేయడం,మత్తు పదార్థాలు బారిన పడకుండా కాలేజీ స్కూల్ పిల్లలు కొరకు అవగాహన సదస్సులు పెట్టడం అలాగే సంకల్పం అనే కార్యక్రమం ద్వారా అవేరేనెస్ కార్యక్రమాలను చేపట్టడం లీగల్ గా చట్టాలు గూర్చి తెలుసుకొనే విధంగా అవగాహన కల్పించడం పోలీస్ శాఖ తో పాటు వివిధ శాఖలు సహకారం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.జిల్లాలో గంజాయి అక్రమ రవాణా ఎక్కువగా అటవీ ప్రాంతం గుండా కొనసాగుతుందని ఉద్దేశంతో ఫారెస్ట్ అధికారులతో చర్చించి నిగా పెట్టడం జరిగిందని అన్నారు. మత్తు పదార్థాలు బారిన పడిన విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించి వారికి అవగాహన కల్పించడం, నాటు సారా అక్రమ రవాణా చేసిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని, సైబర్ నేరాలు బాగా పెరుగు తున్నాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను అవగాహన కల్పించే విధంగా సదస్సులో ఏర్పాటు చేయడం జరుగుతుందని, గుడ్ టచ్ బ్యాచ్ అను కార్యక్రమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ఫోక్ షో చట్టాల గురించి తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో చెక్పోస్టుల వద్ద మరింత పోలీసు బందోబస్తును గట్టి భద్రతను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మావోయిస్టు ప్రాంతాలు ఎక్కువగా ఉండటం వలన పోలీసు నిగా ప్రఠిష్ట చేయడం జరిగిందని అన్నారు. జిల్లాలో పోలీస్ శాఖలో భర్తీ కావలసిన పోస్టులు చాలా ఉన్నాయని తెలిపారు. పాచి పంట పోలీస్ స్టేషన్లో రికార్డులు తనిఖీ చేశారు సిబ్బందికి పోలీసులకు పలు సలహాలు సూచనలు ఇచ్చారు. ఆయనతోపాటు ఏఎస్పీ అంకిత సురేన్, సాలూరు సీఐ రామకృష్ణ, పాచిపెంట ఎస్సై సురేష్ సిబ్బంది హాజరయ్యారు.

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు