

మనన్యూస్,నెల్లూరు:వేదాయపాలెంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగినాయి. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వారితో ఎమ్మెల్యే ఆఫీసు సందడే సందడి.సర్వేపల్లి నియోజకవర్గంతో పాటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సోమిరెడ్డి అభిమానులు.
విద్యార్థులకు ఉపయోగపడేలా పుస్తకాలు, పేదల కోసం దుప్పట్లు అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు.మెగా రక్తదాన శిబిరంలో రక్తదానం చేసి అభిమానం చాటుకున్న యువత.తన పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువతను ప్రత్యేకంగా అభినందించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
వియానీ హోంలోని పలువురు చిన్నారులకు వినికిడి యంత్రాలు పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ వైద్యుల విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణ.
