

మనన్యూస్,నెల్లూరు:ప్రజా సంకల్పంతో సమర్ధతతో పారదర్శకతతో ముందుకు సాగుతున్న వక్ఫ్ బోర్డ్.వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం ప్రత్యేక లీగల్ టీం ఏర్పాటు చేశాం.
రాష్ట్ర వ్యాప్తంగా 162 పెండింగ్ కేసులను పరిష్కరించాం.రాష్ట్ర వ్యాప్తంగా 386 మందికి సకాలంలో నోటీసులు అందచేశాం.
కర్నూల్ లోని 38.70 ఎకరాల భూమి అక్రమ రిజిస్ట్రేషన్ ను రద్దు చేశాం.గత త్రైమాసికంతో పోలిస్తే 32 శాతం ఆదాయాన్ని పెంచాం.
ఆంధ్ర రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా అబ్దుల్ అజీజ్ బాధ్యతలు స్వీకరించి వంద రోజులు పూర్తయింది. వంద రోజుల పాలనపై ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ బుక్లెట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం ప్రత్యేక లీగల్ టీం ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 162 పెండింగ్ కేసులను పరిష్కరించామని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు కేసుల్లో జాప్యం జరగటంతో సీనియర్ న్యాయవాదులను నియమించడం జరిగిందని పేర్కొన్నారు. కర్నూల్ లో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసిన 224.15 ఎకరాల రోజా దర్గాకు సంబంధించిన భూమి యొక్క అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేసేందుకు చర్యలు తీసుకున్నామని, అందులో ఇప్పటికే 38.70 ఎకరాల భూమి యొక్క అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేశామని తెలిపారు. ఎలాంటి రాజీ లేకుండా పారదర్శకమైన నోటీసులు జారీ వ్యవస్థ అమలు చేశామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అక్రమణదారులు అద్దెదారులు బాకీదారులకు 266. 22 ఎకరాలకు గాను 386 మందికి సకాలంలో నోటీసులు అందజేశామని తెలిపారు. వీలైనంత త్వరగా వాటిని స్వాధీనం చేసుకునే దిశగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యవేక్షణ కోసం క్లస్టర్లు వారీగా ప్రత్యేక నిఘా బృందం ఏర్పాటు చేశామని తెలిపారు. గతంలో లేనివిధంగా వక్ఫ్ బోర్డ్ ఉద్యోగుల సహాయనిది ఏర్పాటు చేశామని, ఆర్థిక లావాదేవీల పారదర్శకతను పెంచామని, గతంలో లేని విధంగా క్లౌడ్ బేస్ ర్యాలీ అకౌంటింగ్ సాఫ్ట్ వేర్ ను అమలుపరిచామని, సిబ్బందికి ఫైనాన్స్ మరియు అకౌంటింగ్ పై ప్రత్యేక శిక్షణ ఇచ్చామని తెలిపారు. గతంలో లేని విధంగా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను ప్రారంభించామని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చెల్లింపుల కోసం పిఓఎస్ యంత్రాలు ఏర్పాటు చేశామని వబ్బుడాదాయం పెంచే మార్గంలో ఒక ఆస్తుల లీజు మొత్తాలను శాస్త్రీయంగా నిర్ణయించి వసూళ్లకు కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ తో భేటీ అయి ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయం తీసుకొచ్చామని, ఏపీ వక్ఫ్ బోర్డ్ కు రావాల్సిన పెండింగ్ నగదు చెల్లింపులపై పరస్పర అంగీకారానికి వచ్చామని తెలంగాణ వక్ఫ్ బోర్డ్ ఆఫీసులోని ఏపీ వక్ఫ్ బోర్డ్ రికార్డుల తరలింపు కోసం సంయుక్త కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. కర్నూల్ లోని దర్గా హజరత్ షేక్షావలి షా వలి దర్గా వివాదాలను పరిష్కరించామని, సీనియర్ న్యాయవాదుల సహాయంతో అనేక చట్టపరమైన, జటిలమైన సమస్యలను పరిష్కరించామని బహిరంగ వేలం ద్వారా రికార్డు స్థాయిలో కోటి రూపాయల దర్గా అదాయాన్ని పెంచామని తెలిపారు. గత త్రైమాసికంతో పోలిస్తే వక్ఫ్ బోర్డుకు 32% ఆదాయాన్ని పెంచామని తెలిపారు. కేవలం ఈ వంద రోజుల్లోనే విశేషమైన మార్పులు తెచ్చామని ఇది కేవలం మొదటి అడుగు మాత్రమేనని ఇంకా ఎన్నో సంస్కరణలు అభివృద్ధి పనులు ముందున్నాయని తెలిపారు.
