

మనన్యూస్,నారాయణ పేట:జిల్లా పరిధిలోని ఉట్కూరు మండల కేంద్రంలోని ప్రజలకు, యువకులకు, సైబర్ నేరాలు, మత్తు పదార్థాల వల్ల జరిగే అనర్థాలు, అపరిచిత వ్యక్తుల నుండి అప్రమత్తంగా ఉండాలని, ఐ పీ ఎల్ క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడరాదని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడం జరిగిందని ఎస్ఐ కృష్ణంరాజు తెలిపారు. ఈ సందర్భంగా సందర్భంగా ఎస్ఐ కృష్ణంరాజు మాట్లాడుతూ,ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరగాళ్లు చూపే మోసపూరిత ఆశలకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఒకవేళ సైబర్ నేరానికి గురైతే టోల్ ఫ్రీ నెంబర్ 1930 లేదా డయల్ 100 కి సమాచారం ఇవ్వాలని తెలిపారు. యువకులు ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడరాదని సూచించారు. బెట్టింగ్స్ వల్ల ఆర్థికంగా నష్టపోయి, ఆత్మహత్యలకు దారితీస్తాయని, డబ్బులు లేకపోతే దొంగతనాలకు పాల్పడతారని అలాంటి వాటికి దూరంగా ఉండాలని, తమ పిల్లలు చుట్టుపక్కల వారు బెట్టింగ్ కు పాల్పడితే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని సూచించారు. అపరిచిత వ్యక్తుల నుండి అప్రమత్తంగా ఉండాలని ఎవరి పైనా అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్స్ మహేష్, విజయ్, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
