

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో భాగంగా 5 లక్షల రూపాయల తో సిసి రోడ్లు మంజూరు కావడంతో పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్,మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్,పిట్లం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అడ్వకేట్ రాంరెడ్డి లు కొబ్బరికాయలు కొట్టి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లోనే గ్రామ గ్రామాన అభివృద్ధి జరుగుతుందని అన్నారు. జుక్కల్ నియోజకవర్గం లోని ప్రతి గ్రామ గ్రామాన సిసి రోడ్లు మంజూరు కావడంతో ప్రారంభించి పనులు కూడా పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. చేపట్టిన పనులు నాణ్యతతో చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నాయకులు కుర్మాసాయిలు,బ్రహ్మం హుసేని,బ్యాత్తయ్య,షాదుల్, సాయిలు.తదితరులు ఉన్నారు.
