మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, బీఆర్ఎస్ శ్రేణులంతా కలిసికట్టుగా ఉండాలని.. రాబోయే రోజులు మనవేనని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సోమవారం బాన్సువాడ లో జరిగే ఇఫ్తార్ విందుకు వెళ్తూ.. మార్గమధ్యంలో నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్ రావు పల్లి చౌరాస్తా వద్ద ఆగారు. బీఆర్​ఎస్​ నాయకులు ఆమెకు స్వాగతం పలికారు.పార్టీ కోసం కష్టపడుతున్న వారందరికీ తాము రుణపడి ఉంటామన్నారు.మాజీ సిడిసి చైర్మన్ సీనియర్ నాయకులు పట్లోళ్ల దుర్గరెడ్డి స్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు గైని విఠల్, మనోహర్, రమేష్ గౌడ్ రమేష్, సత్యనారాయణ, రాజు, అంజయ్య, శ్రీకాంత్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, గోరేమియా సాయిలు, సుభాష్ గౌడ్ తదితరులున్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *