

మనన్యూస్,మన్సూరాబాద్ డివిజన్:శ్రీ బాలాజీ నగర్ కాలనీలో నూతన యురొ కిడ్స్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి విచ్చేసి రిబ్బన్ కట్ చేసి యాజమాన్యంతో కలిసి ప్రారంభించిన అనంతరం కిడ్స్ కు స్కూల్ కు సంబంధించిన కిట్స్ ను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో మంచి ఆధునికత తో కిడ్స్ కు వివిధ రకాల వసతులతో, తగిన ప్రణాళికతో స్కూల్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం ఆమని, శ్రీదేవి కాలనీ వాసులు సురేందర్ రెడ్డి, వెంకటేష్, సుధీర్ రెడ్డి, మహేందర్, శ్రీశైలం, రామేశ్వరీ,సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
