గొల్లప్రోలు సమస్యలు పరిష్కరించాలిపాడాపిడికి స్వచ్ఛ గొల్లప్రోలు సభ్యుల వినతి

మనన్యూస్,గొల్లప్రోలు:పట్టణ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పిడికి స్వచ్ఛ గొల్లప్రోలు సభ్యులు వినతిపత్రం అందజేశారు. పిఠాపురం పాడా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ లో పిడి చైత్ర వర్షిణిని కలిసి స్వచ్ఛ గొల్లప్రోలు సభ్యులు సమస్యలు వివరించారు. గొల్లప్రోలు మెయిన్ రోడ్డుకు ఇరువైపులా డ్రైన్ లు ఆధునీకరించి వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే అర్ధాంతరంగా నిలిచిపోయిన సూర్యుడు చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులు మరలా ప్రారంభించి పనులు పూర్తి చేయాలని, ప్రభుత్వ కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చేవారి సౌకర్యం కోసం సులబ్ కాంప్లెక్స్ లు నిర్మించాలని, బైపాస్ రోడ్డు నుండి పట్టణం మీదుగా తిరిగి బైపాస్ చేరేవరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని, వీధి కుక్కల నిర్మూలనకు చర్యలు చేపట్టాలని, నగర పంచాయతీ గ్రంథాలయం పునరుద్ధరించాలని, పట్టణ పరిధిలోని ఏడు సచివాలయాలకు సర్వేయర్ లను నియమించాలని, పొలాల నుండి పంటను తీసుకువచ్చేందుకు వీలుగా పుంత రోడ్లు నిర్మించాలని, శిథిలావస్థలో ఉన్న కలింగల్ లు, రెగ్యులేటర్లకు మరమ్మతులు నిర్వహించడంతో పాటు ఏలేరు, పిబిసి కాలువలకు పడిన గండ్లను పూడ్చి వేయాలని పిడిని కోరారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ గొల్లప్రోలు కన్వీనర్ కొశిరెడ్డి రాజా, సభ్యులు కొమ్ము సత్యనారాయణ, పెదిరెడ్ల వెంకట్రాజు, కర్రి కొండలరావు, కీర్తి ఆదినారాయణ, చోడపునీడి పుల్లపురాజు, జ్యోతుల శివ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///