

మనన్యూస్,నెల్లూరు:చిన్న బజార్ సెంటర్ ఓల్డ్ ఏసీ మార్కెట్ కాంప్లెక్స్ లో నూతన డైరీ పార్లర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విజయ డైరీ చైర్మన్ కొండ్రేడ్డి రంగారెడ్డి తో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్పొరేటర్ జయలక్ష్మి నూతన డైరీ పార్లర్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా పార్లర్ లో జరిగిన పూజా కార్యక్రమాల్లో పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని డైరీ పార్లర్ వ్యాపారం దిగ్విజయంగా సాగాలని ఆకాంక్షించారు.ఈ సందర్బంగా అక్కడకు విచ్చేసిన వైసిపి నేతలను ప్రతి ఒక్కరిని పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పేరుపేరునా పలకరించి వారితో ఆప్యాయంగా మాట్లాడారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వేలూరు ఉమా మహేష్, ఉటుకూరు నాగార్జున, నీలి రాఘవరావు, కామాక్షి దేవి, గుంజి జయలక్ష్మి, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు మజ్జిగ జయ కృష్ణారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ పెర్నెటి కోటేశ్వర రెడ్డి, యువజన విభాగం నాయకులు కిషన్, వైసిపి నాయకులు మహేష్ యాదవ్, బాలకృష్ణారెడ్డి, సింగంశెట్టి అశోక్, మీరా మొహిద్దీన్ స్థానిక వై సి పి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
