మనన్యూస్,నెల్లూరు రూరల్:నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కనుపర్తిపాడు వద్ద 75 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. చిల్డ్రన్స్ పార్క్ జంక్షన్ వద్ద కూడా ఫ్లై ఓవర్ రావలసిన అవసరం ఉంది. స్థానిక ఎమ్మెల్యే గా నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తో కలసి ప్రయత్నం చేస్తున్నా అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో చిల్డ్రన్స్ పార్క్ జంక్షన్ వద్ద కూడా ఫ్లై ఓవర్ సాధిస్తాం అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ప్రతి నెలకు ఒక సారి ప్రత్యేకంగా ఈ ఫ్లై ఓవర్లు పనులను పరిశీలిస్తా అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. వేగవంతంగా, పూర్తి నాణ్యతా ప్రమాణాలతో ఈ రెండు ఫ్లై ఓవర్లు పూర్తి కావాలి అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *