సోలార్ వినియోగం పై గ్రామస్థాయి లో అవగాహన కల్పించాలి: జిల్లా కలెక్టర్: డా ఎస్.వెంకటేశ్వర్

Mana News :- తిరుపతి, నవంబర్ 12 ,(మన న్యూస్ ) :- సోలార్ ఉత్పత్తి, వినియోగం పై గ్రామస్థాయి లోని ప్రజలకు పూర్తి స్థాయి లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ చాంబర్ నందు సౌర విద్యుత్ ఉత్పత్తి మరియు వినియోగం పై జిల్లా నెడ్ క్యాప్ మేనేజర్ దిలీప్ కుమార్ రెడ్డి,ఏ పి ఎస్ పి డి సి యల్, ఎస్ ఈ. సురేంద్రనాయుడు, జిల్లా పంచాయతీ అధికారిణి సుశీలదేవి, నాబార్డు అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసులు రెడ్డిల తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సోలార్ ఉత్పత్తి మరియు వినియోగం పై గ్రామస్థాయి లోని ప్రజలకు పూర్తి స్థాయి లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సంబందిత అధికారులకు సూచించారు. సోలార్ వినియోగంవల్ల కాలుష్య రహిత పర్యావరణహిత ఇంధన వినియోగం కొరకు సౌర విద్యుత్ ఉత్పత్తి ని చేపట్టి వినియోగంలోనికి తీసుకొచ్చేందుకు సంబందిత అధికారులు ప్రణాళికలను రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సౌర విద్యుత్తు ఉత్పత్తిని ప్రోత్సహించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను తీసుకొచ్చాయని ఇందులో భాగంగా పి.ఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. ఈ పథకం ను జిల్లాలో అమలుపరచడానికి ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారుల ను ఆదేశించారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ చైర్ పర్సన్ గా మరియు ఆరుగురు మెంబర్లుగా జిల్లా పరిషత్ సి.ఈ. ఓ, లీడ్ బ్యాంక్ మేనేజర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్.పి.డి.సి.ఎల్, జిల్లా నెడ్ క్యాప్ అధికారి, మరియు ఇతర సిబ్బందితో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. సదరు కమిటీ పీ.ఎం. సూర్యఘర్ ముఫ్తీ బిజిలి యోజన అమలును పర్యవేక్షిస్తుంది అని తెలిపారు. జిల్లా లో 5 వేల మంది జనాభా కలిగిన గ్రామాలను గుర్తించాలని జిల్లా పంచాయతీ అధికారిణి కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 19 న నిర్వహించే జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో గ్రామాలను ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. ఈ పథకం ద్వారా గృహ వినియోగదారులు స్వయంగా తామే తమ ఇంటి పై భాగంలో సౌర విద్యుత్ తయారు చేసుకునే మరియు వినియోగించుకునే వెసులుబాటును కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీ కల్పిస్తూ స్తోందన్నారు. అందుకు ఆసక్తి గలవారు దరఖాస్తును పి.ఎం సూర్య ఘర్ పోర్టల్ నందు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. ఒక కిలో వాట్ కు 30 వేల రూపాయలు, రెండు కిలో వాట్ లకు 60 వేల రూపాయలు, మూడు కిలో వాట్ లు మరియు ఆ పైన యూనిట్లకు 78 వేల రూపాయలు కేంద్రం నుండి రాయితీ వినియోగదారుని ఖాతాలో నేరుగా జమ అవుతుంది అని తెలిపారు. 100 కిలో వాట్లు పైబడిన ప్రభుత్వ కార్యాలయాలలో ఎన్.వి.వి. ఎన్ మరియు నెడ్ క్యాప్ ఫేజ్ -1 లో సౌర విద్యుత్తు ప్లాంట్లు అమర్చడానికి సంబంధిత అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారని అన్నారు. మోడల్ సోలార్ విలేజ్ కోసం 5 వే లు జనాభా కలిగిన 5 గ్రామాలను గుర్తించి వాటిని సోలార్ గ్రామాలుగా తీర్చి సిద్ధేందుకు చర్యలు తీసుకోవాలని అధికారుల ను ఆదేశించారు.సోలార్ విద్యుత్ ఉత్పత్తి మరియు వినియోగించుటకు ఇప్పటికే జిల్లాలో 122 ప్రభుత్వ కార్యాలయాల ను గుర్తించడం జరిగిందని జిల్లా నెడ్ క్యాప్ మేనేజర్ కలెక్టర్ కు తెలియజేశారు.

Related Posts

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!