భరోసా సెంటర్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు వారికి అవసరమైన న్యాయం కల్పించడం జరుగుతుంది

గద్వాల జిల్లా(మనన్యూస్ ప్రతినిధి) నవబంర్ 12జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో నూతనంగా నిర్మించిన భరోసా సెంటర్ భవనానికి జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భరోసా సెంటర్ల ద్వారా మహిళలకు పూర్తి సంరక్షణ కల్పించే విధంగా సేవలు అందించడం జరుగుతుందన్నారు. మహిళలు, బాలికలపై జరిగే అత్యాచారాలు, అఘాయిత్యాలు, ఫాక్సో కేసులను ఈ సెంటర్ ద్వారా బాధితులకు న్యాయం, ఆర్థిక సహకారం, సహకారం అందించి వారికి భరోసా కల్పించడం జరుగుతుందన్నారు. మహిళలు ప్రతి ఒక్కరు భరోసా సెంటర్ ద్వారా లభించే సేవలు సదుపాయాలతో పాటు కేసు నమోదు ఇలాంటి విషయాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో భరోసా సెంటర్ నిర్మాణానికి మెగా ఇన్ఫ్రా స్ట్రక్చర్ దాదాపు 2.10 కోట్ల రూపాయలు సొంత డబ్బులు వెచ్చించడం చాలా గొప్ప విషయం అని కొనియాడారు. అంతకుముందు జిల్లా ఎస్పీ, సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన గావించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, భరోసా కేంద్రం ద్వారా బాధిత మహిళలు పిల్లలకు న్యాయం జరిగేలా కృషి చేయడం జరుగుతుందన్నారు. గద్వాలలో 2002లో భరోసా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భరోసా కేంద్రంతో పాటు షీ టీమ్స్ పనిచేస్తుందని బాధిత మహిళలు బాలలకు ఒకే గొడుగు క్రింద పనిచేస్తాయని తెలిపారు. భరోసా కేంద్రాలలో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని ఎస్పీ తెలిపారు. ఉమెన్స్ వింగ్ ఆధ్వర్యంలో న్యాయ సలహాలు వైద్యం సైకాలజీ తదితర వాటిపై పనిచేస్తాయని అన్నారు. నిరాదరణకు గురైన మహిళలు బాలలకు భరోసా కల్పించేందుకు గద్వాల, మహబూబ్ నగర్ జిల్లాలలో భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫోక్సో కేసుల అనంతరం వారి విచారణ కోర్టులో న్యాయం జరిగే వరకు వారి బాగోగులు చూస్తారని తెలిపారు. భరోసా కేంద్రంతో పాటు ఐసిడిఎస్ సఖి ఎన్జీవో వారికి బాధ్యత ఉంటుందన్నారు. ఇప్పటి వరకు 195 కేసులు నమోదు కాగా 158 ఫోక్సో కేసులు ఉన్నాయని అన్నింటికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. 197 మంది బాధిత మహిళలకు రూ. 35 లక్షలు ఇప్పించినట్లు తెలిపారు. బాధిత మహిళలకు పిల్లలకు 24/7 సేవలు అందిస్తుందన్నారు. మెగా కంపెనీ అసోసియేట్ జనరల్ మేనేజర్ నాగరాజు మాట్లాడుతూ, తెలంగాణలో ఇప్పటి వరకు తమ సంస్థ ద్వారా నాలుగు జిల్లాలలో భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఒక్కొక్కటి రూ.2.10 కోట్లతో నిర్మించినట్లు ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు, అడిషనల్ ఎస్పీ గుణశేఖర్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి సుధారాణి, పోలీసు శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    చెక్పోస్ట్ దగ్గర అప్రమత్తంగా ఉండాలి,ఉట్కూర్ ఎస్సై కృష్ణంరాజు.

    మన న్యూస్, నారాయణ పేట:- రబీ సీజన్లో నారాయణపేట జిల్లా లోకి పోరుగు రాష్ట్రం నుండి అక్రమంగా వరి ధాన్యం రాకుండా ఉండేందుకు ఉట్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బార్డర్లో ఏర్పాటుచేసిన సమీస్తాపూర్ చెక్పోస్టును ఎస్ ఐ కృష్ణంరాజు ఆకస్మికంగా తనిఖీ…

    ఉండవెల్లి మండలం ప్రగటూరు గ్రామంలో 18 గడ్డివాములు దగ్ధం

    గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 2 :- జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ప్రగటూరు గ్రామం లో రైతు లు 18 గడ్డివాములు కాళీ పోవడం జరిగింది 800 పియుఎస్ పైప్ లూ కలిపోవడం జరిగింది ఫైర్ సిబ్బంది…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నెల్లూరు ,వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి ఆర్థికసాయం అందజేసిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

    నెల్లూరు ,వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి ఆర్థికసాయం అందజేసిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

    ఎ స్టార్ ఈజ్ బార్న్ సినిమా నుండి “నా గతమే” సాంగ్ ను విడుదల చేసిన డైరెక్టర్ చందు మొండేటి !!!

    ఎ స్టార్ ఈజ్ బార్న్ సినిమా నుండి “నా గతమే” సాంగ్ ను విడుదల చేసిన డైరెక్టర్ చందు మొండేటి !!!

    “మే”డే‌ కార్యక్రమాలకు ముఖ్యాతిదిగా పాల్గొన్న జిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు.

    “మే”డే‌ కార్యక్రమాలకు ముఖ్యాతిదిగా పాల్గొన్న జిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు.

    చెక్పోస్ట్ దగ్గర అప్రమత్తంగా ఉండాలి,ఉట్కూర్ ఎస్సై కృష్ణంరాజు.

    చెక్పోస్ట్ దగ్గర అప్రమత్తంగా ఉండాలి,ఉట్కూర్ ఎస్సై కృష్ణంరాజు.

    ఇందుకూరుపేట మండలం, గంగపట్నం పల్లిపాళెంలో కన్నుల పండుగగా జరిగిన సీతారామ విగ్రహ ప్రతిష్ట పూజలు

    ఇందుకూరుపేట మండలం, గంగపట్నం పల్లిపాళెంలో కన్నుల పండుగగా జరిగిన సీతారామ విగ్రహ ప్రతిష్ట పూజలు

    నెల్లూరు రూరల్ 31వ డివిజన్ అక్కచెరువుపాడు టిడ్కో గృహాలపై ప్రత్యేక దృష్టి- నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

    నెల్లూరు రూరల్ 31వ డివిజన్ అక్కచెరువుపాడు టిడ్కో గృహాలపై ప్రత్యేక దృష్టి- నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి