భరోసా సెంటర్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు వారికి అవసరమైన న్యాయం కల్పించడం జరుగుతుంది

గద్వాల జిల్లా(మనన్యూస్ ప్రతినిధి) నవబంర్ 12జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో నూతనంగా నిర్మించిన భరోసా సెంటర్ భవనానికి జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భరోసా సెంటర్ల ద్వారా మహిళలకు పూర్తి సంరక్షణ కల్పించే విధంగా సేవలు అందించడం జరుగుతుందన్నారు. మహిళలు, బాలికలపై జరిగే అత్యాచారాలు, అఘాయిత్యాలు, ఫాక్సో కేసులను ఈ సెంటర్ ద్వారా బాధితులకు న్యాయం, ఆర్థిక సహకారం, సహకారం అందించి వారికి భరోసా కల్పించడం జరుగుతుందన్నారు. మహిళలు ప్రతి ఒక్కరు భరోసా సెంటర్ ద్వారా లభించే సేవలు సదుపాయాలతో పాటు కేసు నమోదు ఇలాంటి విషయాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో భరోసా సెంటర్ నిర్మాణానికి మెగా ఇన్ఫ్రా స్ట్రక్చర్ దాదాపు 2.10 కోట్ల రూపాయలు సొంత డబ్బులు వెచ్చించడం చాలా గొప్ప విషయం అని కొనియాడారు. అంతకుముందు జిల్లా ఎస్పీ, సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన గావించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, భరోసా కేంద్రం ద్వారా బాధిత మహిళలు పిల్లలకు న్యాయం జరిగేలా కృషి చేయడం జరుగుతుందన్నారు. గద్వాలలో 2002లో భరోసా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భరోసా కేంద్రంతో పాటు షీ టీమ్స్ పనిచేస్తుందని బాధిత మహిళలు బాలలకు ఒకే గొడుగు క్రింద పనిచేస్తాయని తెలిపారు. భరోసా కేంద్రాలలో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని ఎస్పీ తెలిపారు. ఉమెన్స్ వింగ్ ఆధ్వర్యంలో న్యాయ సలహాలు వైద్యం సైకాలజీ తదితర వాటిపై పనిచేస్తాయని అన్నారు. నిరాదరణకు గురైన మహిళలు బాలలకు భరోసా కల్పించేందుకు గద్వాల, మహబూబ్ నగర్ జిల్లాలలో భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫోక్సో కేసుల అనంతరం వారి విచారణ కోర్టులో న్యాయం జరిగే వరకు వారి బాగోగులు చూస్తారని తెలిపారు. భరోసా కేంద్రంతో పాటు ఐసిడిఎస్ సఖి ఎన్జీవో వారికి బాధ్యత ఉంటుందన్నారు. ఇప్పటి వరకు 195 కేసులు నమోదు కాగా 158 ఫోక్సో కేసులు ఉన్నాయని అన్నింటికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. 197 మంది బాధిత మహిళలకు రూ. 35 లక్షలు ఇప్పించినట్లు తెలిపారు. బాధిత మహిళలకు పిల్లలకు 24/7 సేవలు అందిస్తుందన్నారు. మెగా కంపెనీ అసోసియేట్ జనరల్ మేనేజర్ నాగరాజు మాట్లాడుతూ, తెలంగాణలో ఇప్పటి వరకు తమ సంస్థ ద్వారా నాలుగు జిల్లాలలో భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఒక్కొక్కటి రూ.2.10 కోట్లతో నిర్మించినట్లు ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు, అడిషనల్ ఎస్పీ గుణశేఖర్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి సుధారాణి, పోలీసు శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ). జిల్లా కేంద్రానికి సరిహద్దుల్లో ఉన్న పత్తి మిల్లులను, సరిహద్దులోని చెక్ పోస్టులను అదనపు కలెక్టర్ వి. విక్టర్ పరిశీలించారు.మద్నూర్ మండలంలోని మంగళవారం అంతరాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటుచేసిన చెకో పోస్టును తనిఖీచేశారు.చెక్ పోస్టు సిబ్బందికి పోలీసులకు…

    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మద్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో జుక్కల్ నియోజకవర్గ ఈఆర్ వో (ఓటరు నమోదు అధికారి), జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!