

బంగారు పాళ్యం మార్చి 6 మన న్యూస్
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం జిల్లేడుపల్లి పంచాయితీ పరిధిలో గత ప్రభుత్వంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద సచివాలయ భవనాన్ని 40 లక్షలతో మంజూరు చేయడం జరిగింది. ఈ భవనానికి కాంట్రాక్టర్ మునీశ్వర్ రెడ్డి తన సొంత స్థలంలో, సచివాలయ భవనానికి స్థలం ఇచ్చి అతనే భవనాన్ని కాంట్రాక్టర్ తీసుకొని నిర్మాణం చేశారు. కానీ ఆయనకు రావలసిన డబ్బులలో 11 లక్షల రూపాయలు పెండింగ్లో ఉన్నందువల్ల, ఎన్ఆర్ఈజీఎస్ వారు బిల్లులు కాంట్రాక్టర్ మునీశ్వర్ రెడ్డికి ఇవ్వకపోవడంతో గత కొన్ని నెలలుగా భవనాన్ని పంచాయతీ వారికి ఇవ్వలేదు. ఈ తరుణంలో గత రెండు రోజుల క్రితం కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు, మండల అభివృద్ధి అధికారి,, తహసీల్దారు వెళ్లి సచివాలయ భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని తెలియజేయడం జరిగింది. మండల అభివృద్ధి అధికారి శ్రీధర్ కాంట్రాక్టర్ చేసిన పనులకు బిల్లులు సకాలంలో పూర్తిగా అందించినట్లు, బిల్లులతో సహా కాంట్రాక్టర్ కు వివరించడంతో తమకు సచివాలయ భవనాన్ని స్వాధీనం చేయాలని తెలపడంతో, 06-03-2025 వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు కాంట్రాక్టర్ మునీశ్వర్ రెడ్డి సచివాలయ భవనాన్ని, భవనానికి ఉన్న తాలాన్ని ఎంపీడీవో శ్రీధర్ కు జిల్లేడుపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ వేణు రెడ్డి ద్వారా అందజేశారు. దీంతో కొన్ని సంవత్సరాలుగా నడచిన సచివాలయ భవన తగాదాలు ఒక కొలిక్కి రావడంతో, జిల్లేడుపల్లి పంచాయతీ లో వివాదం సద్దుమణిగింది . కాంట్రాక్టర్ ఎవరు పెండింగ్ పనులు ప్రారంభించిన, (లేక) కాంట్రాక్టర్ మునీశ్వర్ రెడ్డి ప్రారంభించిన వెంటనే ఐదు లక్షల రూపాయలకు పై అధికారులతో సంప్రదించి ప్రపోజల్ పంపించి మిగిలిన పనులు పూర్తిచేసే వారికి పనులు ఇస్తామని ఇన్చార్జి ఎంపిడిఓ శ్రీధర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు తొందరలో సచివాలయ భవనాన్ని శంకుస్థాపన చేయాలని మండల ఇన్చార్జ్ ఎంపీడీవో శ్రీధర్ సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచి భారతమ్మ, మాజీ సర్పంచి జె. అశోక్ రెడ్డి, కొత్తూరు భాను ప్రకాష్ రెడ్డి, శంకర్ రెడ్డి, చిట్టి రెడ్డి, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు
