ఎస్ఆర్ పురం, మన న్యూస్:- రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గంగాధర నెల్లూరు పర్యటనను విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు బుధవారం గంగాధర్ నెల్లూరు మండలంలో రామానాయుడు పల్లి వద్ద ఎలిప్యాడ్ స్థలాన్ని అలాగే పింఛన్ల పంపిణీ చేసే లబ్ధిదారులను చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మాట్లాడుతూ..సీఎం చంద్రబాబు చేతుల మీదుగా.. నిరుద్యోగులకు 10 ఆటో వాహనాలు, వికలాంగులకు 10 సైకిల్ లు,నిరుపేద ఉన్నత విద్య చదువుతున్న 10 మంది విద్యార్థులకు ల్యాప్ టాప్ లుఎస్టీ కాలనీలో అగ్నికి ఆహుతి అయిన ఇద్దరు బాధితులకు రూ. 1.30 లక్షల రూపాయల చెక్కు పంపిణీ, ఎస్సీ కాలనీలో నిరుపేద లబ్ధిదారులకు ఇంటి పట్టాలతో పాటు..జీడి నెల్లూరు నియోజకవర్గంలోని 6 మండలాలకు సంబంధించి సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తెలిపారు ఈ ముఖ్యమంత్రి పర్యటనకు పోలీసు యంత్రాంగం మీడియా సహకారం అందించాలని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎస్పి సాయినాథ్ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు గుండయ్య రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి చిట్టి బాబు నాయుడు మండల అధ్యక్షుడు స్వామి దాసు యాదవ సాధికార సమితి జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ యాదవ్, సగి, బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ రాజేంద్రన్ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి యుగంధర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.