పాడి రైతుల అభివృద్ధి కొరకు మినీ గోకులం షెడ్డు పథకం ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్
మన న్యూస్ ,గంగాధర నెల్లూరు:-
గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధిలో పలు మండలాల్లో మినీ గోకులం షెడ్ల ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పాడే రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని వారిని ఆదుకోవాలని భావనతో మినీ గోకులం షెడ్డు పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. అందులో భాగంగా పాలసముద్రం మండలం తిరుమలరాజపురం, T.V.N.R.పురం గంగాధర నెల్లూరు మండలం, పాతపాలెం వెదురుకుప్పం మండలం ఈనం కొత్తూరు, కార్వేటి నగర్ మండలం ఎర్రమరాజుపల్లి గ్రామాల్లో మినీ గోకులం షెడ్డు ను ప్రారంభించడం జరిగిందని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి కి చేయలేని భావనతో పనిచేస్తుందని అన్నారు. ఈ మినీ గోకులం షెడ్డు పథకం ద్వారా పాడి రైతులకు ఎంతో ఉపయోగపడుతోంద ని ఇది పాడి రైతుల పాలిట వరమని అన్నారు. కార్వేటినగరం పాదిరికుప్పం లో నూతన బస్ షెల్టర్ ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి భీమినేని చిట్టిబాబు నాయుడు, రాష్ట్ర మాల కార్పొరేషన్ మెంబర్, పొన్న యుగంధర్, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు గుండయ్య జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ మండల అధ్యక్షులు స్వామిదాస్, వెదురుకుప్పంమాజీ మండల అధ్యక్షులు మోహన్ మురళి, మండల అధికారులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
