

మనన్యూస్,గొల్లప్రోలు:గొల్లప్రోలు,స్వామివివేకానంద జయంతోత్సవం మరియు జాతీయ యువజన.ఉత్సవాలను
పురస్కరించుకుని సాయిప్రియ సేవాసమితి, వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాసు స్వామి వివేకానంద జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించారు.సాయిప్రియ సేవాసమితి జిల్లా ప్రధాన కార్యాలయం కత్తిపూడి నందు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు.అనంతరం జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతదేశంలో పుట్టడం వల్ల హిందువుఆధ్యాత్మికశక్తి మరింత పెరిగిందని, భరతమాత ముద్దుబిడ్డ స్వామివివేకానంద అని, స్వామి వివేకానంద భారతదేశ ఔన్నత్యాన్ని ఆధ్యాత్మికతను పరమతసహనం గురించి ప్రపంచ దేశాలకి చాటి చెప్పిన ఏకైక వ్యక్తి స్వామి వివేకానందాని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.అనంతరం అక్కడకు విచ్చేసిన వారికి సాయిప్రియ సేవాసమితి సిబ్బందికి ఇతరులకు స్వీట్స్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సాయిప్రియ సేవాసమితి సభ్యులు,ఇతరులు పాల్గొన్నారు.