మన న్యూస్, ఎస్ఆర్ పురం:-

చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎస్ఆర్ పురం మండలం మాజీ జడ్పీటీసీ గురువారెడ్డి నియమించిన సందర్భంగా శనివారం మండలంలోని 49 కొత్తపల్లి మిట్ట దీపిక కళ్యాణ మండపంలో ఆయన మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన ఉడమలకుర్తి సర్పంచ్ చిట్టి మహేష్. ఈ సందర్భంగా సర్పంచ్ చిట్టి మహేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో తనదైన శైలిలో రాజకీయంలో గుర్తింపు పొంది ప్రజలలో ఒక పేరు వేసుకున్న వ్యక్తి మాజీ జడ్పిటిసి గురువారెడ్డి ని అన్నారు. ఆయన ఎస్ఆర్ పురం మండలం జడ్పీటీసీ గా ఉన్న సందర్భంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో నిల్చారని అన్నారు. వైఎస్ఆర్సిపి పార్టీ అధిష్టానం ఆయన చేసిన సేవలను గుర్తించి జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. పలువురు నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

గురవారెడ్డి సన్మానిస్తున్న వైసీపీ సర్పంచ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *