మన న్యూస్,ఎస్ఆర్ పురం :- చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎస్ఆర్ పురం మాజీ జెడ్పిటిసి పిళ్ళారి కుప్పం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి నాయకుడు గురవారెడ్డి నియమించినట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా గురవారెడ్డి మాట్లాడుతూ… తనపై నమ్మకం ఉంచి తనకు ఉపాధ్యక్షుడు ఇచ్చిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానని, జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, మాజీ డిప్యూటీ నారాయణస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తా అని గ్రామ స్థాయిలో కార్యకర్తలను ఉత్తేజపరిచి పార్టీ విజయానికి పునాదులు వేస్తామని అన్నారు. తనకు పదవి కేటాయించిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *